: బాబుకు జగన్ హెచ్చరిక


రైతులకు మేలు చేయాలన్న ఆలోచన కానీ, సంకల్పం కానీ, చిత్తశుద్ధి కానీ టీడీపీకి లేవని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. చెన్నైలో బహుళ అంతస్తుల భవంతి కూలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను శ్రీకాకుళంలో పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో రుణమాఫీ ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం సరికాదని అన్నారు. "రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా సహకరించింది మీరు కాదా?" అని జగన్ ప్రశ్నించారు. రైతులను ఆదుకుంటామని చెప్పడంలో చిత్తశుద్ధి ఉంటే... కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ఆయన నిలదీశారు. "కడుపు మండిన రైతు దుస్థితి ఎలా ఉందో మీకు తెలుసా?" అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన బాబు రైతు రుణమాఫీపై మీనమేషాలు లెక్కిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రుణమాఫీ ఆలస్యం చేస్తే తాను నిరాహార దీక్షకు దిగుతానని జగన్ తెలిపారు.

  • Loading...

More Telugu News