: ఉస్మానియా యూనివర్శిటీకి ఫారిన్ విద్యార్థుల తాకిడి
ఉస్మానియా యూనివర్శిటీకి విదేశీ విద్యార్థుల తాకిడి ఎక్కువైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉస్మానియా యూనివర్శిటీలో అడ్మిషన్స్ కోసం ఎక్కువమంది అప్లై చేశారు. ఈ సంవత్సరం దాదాపు 2,415 మంది విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చామని... వీరిలో 1,085 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో.... 1,372 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇచ్చామని ఉస్మానియా యూనివర్శిటీ ఫారిన్ రిలేషన్స్ విభాగం తెలిపింది. గత ఏడాది కేవలం 1,742 మంది విద్యార్ధులు మాత్రమే ఉస్మానియా యూనివర్శిటీలో అడ్మిషన్లు తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఫారిన్ విద్యార్థులు ఎక్కువగా బి.సి.ఎ, బి.కాం, బి.ఎస్.సి, బి.బి.ఎ, ఎం.ఎ(ఇంగ్లిష్), ఎమ్.ఎస్.సి(ఇన్ ఫర్మేషన్ సైన్స్), ఎం.బి.ఎ, మరియు ఎమ్.కాం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం ముగిసి... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో ఫారిన్ విద్యార్ధుల్లో భయాందోళనలు తగ్గాయని... అందువల్లే ఈ సంవత్సరం ఎక్కువమంది విదేశీయులు ఉస్మానియాలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారని యూనివర్శిటీ వర్గాలు అంటున్నాయి.