: పోలీసు శాఖలో మళ్లీ ఆర్డర్లీ కలకలం: హోంగార్డుల ఆందోళన
పోలీసు శాఖలో మరోమారు ఆర్డర్లీ కలకలం రేగింది. దినసరి వేతనంపై విధులు నిర్వర్తిస్తున్న తమను వారి ఇళ్లల్లో పనిచేయాల్సిందిగా ఉన్నతాధికారులు వేధిస్తున్న వైనంపై గురువారం హైదరాబాద్ లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఉద్యోగ భద్రత కరవైన తాము తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్న నేపథ్యంలో, అధికారుల వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయం ముందు జరిగిన ఈ ధర్నాలో పలువురు హోంగార్డులు పాల్గొన్నారు.