: రెండు రోజుల్లో విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత: ఎన్టీపీసీ


దేశంలో ఉన్న ఆరు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో (ధర్మల్ పవర్ ప్లాంట్స్) రెండు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ తెలిపింది. ఆ తర్వాత బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆరు ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోరుతూ ఈ నెల 14న ఎన్టీపీసీ ఛైర్మన్ అరుప్ రాయ్ చౌదరి కేంద్ర విద్యుత్ శాఖకు లేఖ రాశారు. ప్రస్తుత వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి అంతగా లేకుంటే ఇబ్బంది తప్పదని, దానివల్ల ఆరు ప్లాంట్లలో మొత్తం విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుందని లేఖలో వివరించారు. ముఖ్యంగా మూడు విద్యుత్ స్టేషన్లలో ఒకరోజు సరిపడా మాత్రమే బొగ్గు ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News