: కేసీఆర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: రావెల కిశోర్ బాబు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. స్థానికతకు సంబంధించి ఇప్పటికే ఆర్టికల్ 371(డీ) నిబంధన ఉండగా, కొత్త నిబంధనలను ఎలా ప్రవేశపెడతారని ఆయన గురువారం ప్రశ్నించారు. కేసీఆర్ దుందుడుకు వైఖరిపై గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రావెల విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదన్న విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు.