: స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడడడం ప్రభుత్వ విధి: కేంద్రమంత్రి హర్షవర్థన్
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకుముందు పాఠశాలల్లో లైంగిక విద్య, కండోమ్ ల వాడకంపై వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈసారి స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడారు. స్వలింగ సంపర్కులూ మనుషులే అని, వారికి హక్కులుంటాయని అభిప్రాయపడ్డారు. వారి హక్కులను కాపాడడం ప్రభుత్వ విధి అని స్పష్టం చేశారు. కాగా, ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరం అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొనగా, ఆ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. దీనిపై మీడియా ప్రశ్నించగా జవాబిచ్చేందుకు మంత్రి నిరాకరించారు.