: ఇలాంటి వివక్ష దేశంలో ఎక్కడైనా ఉంటుందా?: సోమిరెడ్డి


ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న స్థానికత నిబంధనపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారికే బోధనా రుసుం ఇస్తామనడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి వివక్ష ఉంటుందా? అని ప్రశ్నించారు. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్నారు. 30 ఏళ్ల నుంచి ఉన్న ఇతర రాష్ట్రాల వాసులను స్థానికులు కాదంటారా? అని సూటిగా అడిగారు. ఈ విషయంలో పేదలపై ఎందుకు ప్రతాపం చూపిస్తున్నారన్నారు. విశ్వనగరంగా మారుస్తామన్న హైదరాబాదును విధ్వంస నగరంగా మారుస్తారా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News