: కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ముగిసిన సీఎస్ ల భేటీ


ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల (సీఎస్) సమావేశం ముగిసింది. విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాస్పద అంశాలపై చర్చించేందుకు ఈ భేటీని హోంశాఖ ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు చూస్తున్న అడిషనల్ కార్యదర్శి సురేష్ కుమార్ సహా పలువురు అధికారులు ఇరు రాష్ట్రాల సీఎస్ లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కృష్ణానది జలవివాదాలు, కృష్ణా ట్రైబ్యునల్ పొడిగింపు, పీపీఏలపై ప్రధానంగా చర్చ జరిగింది. హైదరాబాదులో గవర్నర్ అధికారాలపై ఇప్పుడు చర్చించేదేమీ లేదని హోంశాఖ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News