: లార్డ్స్ టెస్టుతో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది: బాయ్ కాట్


లార్డ్స్ టెస్టు ద్వారా ఏ జట్టు మెరుగైనదో తేలిపోతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ అన్నాడు. తొలి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో రెండో టెస్టు ఇంగ్లండ్, భారత్ జట్ల పునరుత్థాన సామర్థ్యాలకు పరీక్ష పెడుతుందని అభిప్రాయపడ్డాడు. ట్రెంట్ బ్రిడ్జ్ మ్యాచ్ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న జట్టు విజేత అవుతుందని తెలిపాడు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బౌలర్లకు అనుకూలించలేదని, చివరికి టెయిలెండర్లు సైతం బ్యాట్ ఝుళిపించారని పేర్కొన్నాడు. అయితే, లార్డ్స్ పిచ్ మాత్రం బౌలర్లకు విశేషంగా సహకరిస్తుందని బాయ్ కాట్ వివరించాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు నేటి నుంచి లార్డ్స్ లో జరగనుంది.

  • Loading...

More Telugu News