: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరింది: ఆప్


ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో బీజేపీకి సహాయం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడింది. వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్విట్టర్ లో పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ కొన్ని వ్యాఖ్యలు పోస్టు చేశారు. గతంలోనే ఈ విషయంలో గవర్నర్ ను సమయం కోరామని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీని రద్దు చేయాలని అడిగామన్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నైతిక విలువలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అటు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ ను కలవాలని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అనుకుంటున్నట్టు, ప్రస్తుతం ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News