: అర్ధరాత్రి సంజయ్ ను కలిసిన షారుక్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను మరో నటుడు షారుక్ ఖాన్ కలిశాడు. గత అర్ధరాత్రి ముంబయిలోని సంజూ నివాసానికి వెళ్లి పరామర్శించాడు. ఈ సమయంలో సంజయ్ భార్య మాన్యతతోనూ షారుక్ మాట్లాడినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలపాటు సంజయ్ తో పలు విషయాలపై షారుక్ మాట్లాడినట్లు తెలుస్తోంది. హిందీ చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నటులుగా కొనసాగుతున్న షారుక్, సంజయ్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే.

ఇదిలావుంటే.. కోర్టు ఎదుట లొంగిపోయేందుకు కొన్ని నెలల సమయం ఇవ్వాలంటూ సంజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈలోపు ఒప్పుకున్న చిత్రాలను పూర్తిచేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు మున్నాభాయ్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News