: ఖరీఫ్ రుణప్రణాళికను తక్షణమే అమలు చేయాలి: జీవన్ రెడ్డి
తెలంగాణలో ఖరీఫ్ రుణప్రణాళికను తక్షణమే అమలు చేయాలని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ అయ్యేలోగా రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారిన పడే ప్రమాదముందని గురువారం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి పేరు చెప్పి ఫీజు రీయింబర్స్ మెంట్, హౌసింగ్, రేషన్ కార్డులు తదితర పథకాలను నీరుగార్చే యత్నం జరుగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన, పేద బీసీలకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.