: బెనారసీ చీరలకు మహర్దశ... బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక


దేశంలోకెల్లా నాణ్యమైన చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం వారణాసి. ఇక్కడ రూపొందే చీరలను బెనారసీ చీరలుగా పిలవడం తెలిసిందే. బంగారు, వెండి జరీ ఉపయోగించి, నాణ్యమైన పట్టుతో నేసే ఇక్కడి చీరలు ఖరీదైనవే గాకుండా, అత్యంత మన్నికైనవి కూడా. ఇప్పుడా చీరలకు మహర్దశ పట్టనుంది. బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాను బెనారసీ చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ కేంద్ర టెక్స్ టైల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా టెక్స్ టైల్ మంత్రిత్వ శాఖ జోరా చటర్జీ మాట్లాడుతూ, ప్రియాంక కేవలం బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలోనూ బెనారసీ చీరలకు సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. వారాణాసిలోని చేనేత కార్మికులతో సమావేశం సందర్భంగా జోరా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News