: వెనెజులా కొత్త అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో
వెనెజులా నూతన అధ్యక్షుడిగా నికోలస్ మాడ్యురో ఎన్నికయ్యారు. దివంగత హ్యూగో చావెజ్ వారసుడయిన మాడ్యురో సోషలిస్టు అభ్యర్ధిగా పోటీ చేసి, 3 లక్షల స్వల్ప (50.7%) మెజారిటీతో విజయం సాధించారు. విపక్ష అభ్యర్ధి హెన్రిక్ 49.1 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఆదివారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 80 శాతం ఓటింగ్ నమోదయిందని ఇక్కడి అధికారులు తెలిపారు. తీవ్ర అనారోగ్యం కారణంగా మార్చి 5న వెనెజులా అధ్యక్షుడు చావెజ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజులాకు మళ్లీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు.