: ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు బాలల మృతి
హమాస్ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని బుధవారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పాలస్తీనాకు చెందిన నలుగురు బాలలు చనిపోయారు. ఈజిప్టు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించని నేపథ్యంలో బుధవారం ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన పాలస్తీనియన్ల సంఖ్య 213కు చేరింది. మరోవైపు హమాస్, ఇజ్రాయెల్ ల మధ్య ఐదు గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మానవతా దృక్పథంతో ఐదు గంటల పాటు కాల్పుల విరమణను పాటించాలన్న ఐక్యరాజ్యసమితి వినతి మేరకు ఇరువర్గాలు ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు ఐరాస ప్రతినిధి ఒకరు చెప్పారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు గాజాలో కాల్పుల విరమణ అమలులో ఉంది.