: స్వామి భక్తి ప్రదర్శిస్తున్న శివలాల్ యాదవ్


బీసీసీఐ మధ్యంతర అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా బీసీసీఐ పగ్గాలు సంతోషంగా అప్పగిస్తానని పేర్కొన్నారు. శ్రీనివాసన్ మరలా భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తానని తెలిపారు. చెన్నైలో తమిళనాడు క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సన్మాన కార్యక్రమంలో శివలాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐసీసీ అధిపతిగా శ్రీనివాసన్ ఎన్నిక కావడం హర్షణీయమని పేర్కొన్నారు. శ్రీనీపై అవినీతి ఆరోపణలన్నీ కేవలం మీడియాలోనే వింటున్నామని పరోక్షంగా వార్తా మాధ్యమాన్ని విమర్శించారు. ఆయన చలవతో టెస్టు క్రికెటర్లే కాకుండా, రంజీ క్రికెటర్లూ లాభపడుతున్నారని ఈ హైదరాబాదీ వివరించారు. ఎంతోమంది బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేశారని, పదవీకాలం ముగియగానే వెళ్ళిపోయారని... అయితే, వారందరిలో శ్రీనివాసన్ ప్రత్యేకమని శివలాల్ కొనియాడారు. దేశవాళీ క్రికెటర్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శ్రీనీ తీసుకున్న చర్యలే కారణమని చెప్పారు.

  • Loading...

More Telugu News