: సెబీ నిషేధంపై అప్పీలుకు వెళ్లనున్న 'సత్యం' రామలింగరాజు?


స్టాక్ మార్కెట్లలో అక్రమ లావాదేవీలతో మోసానికి పాల్పడ్డారంటూ సత్యం కంపూటర్స్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు, మరో నలుగురు కుటుంబసభ్యులపై సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు భారీ జరిమానా చెల్లించాలని, మార్కెట్లకు పద్నాలుగేళ్ల పాటు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సెబీ ఇచ్చిన తాజా ఉత్తర్వులపై శాట్ (సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్)లో రాజు సవాల్ చేయవచ్చని సమాచారం. ఒకవేళ అక్కడ కూడా సరైన తీర్పు రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలుస్తోంది. 45 రోజుల్లో దాదాపు వడ్డీ సహా రూ.3వేల కోట్లు చెల్లించాలన్న సెబీ ఆదేశం ప్రకారం... అంతతక్కువ సమయంలో ఇవ్వలేకపోవచ్చని, అందుకే వారంతా తప్పకుండా అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉందని సీబీఐ న్యాయస్థానంలో సత్యం కేసు విచారణను పరిశీలిస్తున్న న్యాయవాదవర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News