: లారీ బోల్తా పడి ముగ్గురు మృతి
కడప జిల్లాలో గురువారం లారీ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. లారీ బెంగళూరు నుంచి కడపకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.