: మంత్రిగారి మెడికల్ బిల్లుల కోసం రూల్సు మార్చారు!
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..! పక్కా ప్రణాళికతో రూపొందించిన నిబంధనలను సైతం అమాత్యుల కోసం మార్చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. కర్ణాటకలో ఇలాగే జరిగింది. ఓ మంత్రి మెడికల్ బిల్లుల రీయింబర్స్ మెంట్ ను పరిమితికి మించి అనుమతించింది కన్నడ సర్కారు. ఇటీవల అనారోగ్యం పాలైన గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ చికిత్స కోసం రూ.1.16 కోట్లు ఖర్చవగా, చెల్లించేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. అయితే, నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల వైద్య ఖర్చుల పరిమితి రూ.5 లక్షలే. అయితే, అంబరీష్ వ్యహారాన్ని 'ప్రత్యేక కేసు'గా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య విశేష అధికారాలు ఉపయోగించి నిబంధనలను సడలించారు. అంబరీష్ సింగపూర్లో ట్రీట్ మెంట్ తీసుకోగా... ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యులందరి విమానఛార్జీలను సైతం కన్నడ సర్కారే భరించింది.