: అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న ఎస్ కే వర్సిటీ ఉద్యోగులు


అమర్ నాథ్ యాత్రలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఉద్యోగులు ఇద్దరు చిక్కుకుపోయారు. అనంతపురంలోని వర్సిటీ నుంచి వెళ్లిన చలపతి, రమేశ్ అనే ఉద్యోగులు మార్గమధ్యంలో రాంబాగ్ వద్ద చిక్కుకుపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో రాంబాగ్ సమీపంలో కొండ చరియలు విరిగిపడటంతో యాత్రికులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బాధితుల కుటుంబీకుల నుంచి సమాచారం అందుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో డీజీపీ జేవీ రాముడు జమ్మూ కాశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News