: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గా బి.అశోక్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ గా బి.అశోక్ నియమితులయ్యారు. మోడీ సర్కారు వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్ద నియామకం ఇదే. కాగా, అశోక్ నియామకం యూపీఏ-2 హయాంలోనే జరిగింది. అయితే, ఆ ఫైలుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి క్లియరెన్స్ లభించకపోవడంతో నియామకం ఆలస్యం అయింది.