: అద్భుత రీతిలో జర్నలిస్టు భవన్ నిర్మిస్తాం: కేసీఆర్
జర్నలిస్టుల కోసం హైదరాబాదులో ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తామని టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జర్నలిస్ట్ భవన్ పేరుతో నిర్మించే ఈ భవనాన్ని నగరంలోని మంచి ప్రాంతంలో నిర్మిస్తామని చెప్పారు. ఈ భవనంలో అన్ని హంగులూ ఉంటాయని... దేశం ఆశ్చర్యపోయే రీతిలో ఇది ఉంటుందని చెప్పారు. జర్నలిస్టులు, అడ్వొకేట్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నిన్న టీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఈ వివరాలు తెలిపారు.