: సొంత టీవీ చానల్ పెట్టే యోచనలో చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సొంత టీవీ చానల్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ కార్యకలాపాలతో ఈ చానల్ కు సంబంధం ఉండదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి పార్టీ నేతలతో కూడా చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.