: ఫ్యూచర్ మార్కెట్లో 27వేలకు పడిపోయిన బంగారం
బంగారం ధరలు ఈ రోజు కూడా పతనం దిశగానే సాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 10 గ్రాములకు వెయ్యి రూపాయలకు పైగా ధరలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఎంసిఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర జూన్ నెల కాంట్రాక్ట్ 3శాతం వరకూ క్షీణించి 27140వద్ద ట్రేడవుతోంది. ఇంకా స్పాట్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలు కాలేదు.
మరోవైపు హాంకాంగ్ మార్కెట్లోనూ ఈ రోజు బంగారం ధరలు పతనం దిశగానే సాగుతున్నాయి. ఔన్స్ ధర 36 డాలర్లు తగ్గి 1440 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.