: ‘కల్యాణ లక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్


వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దసరా, దీపావళి మధ్య పెన్షన్లు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం త్వరలో ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించనున్నామని... ఈ పథకం కింద దళిత, గిరిజన యువతుల వివాహానికి ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయలను అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆటోలు, ట్రాలీలపై తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీంతో ఆటోలు, ట్రాలీలపై ఉన్న రవాణా పన్నును రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 500 మంది జనాభా ఉండే దళిత, గిరిజన గూడెంలను గ్రామ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News