: రైతు రుణాలనే కాదు... డ్వాక్రా సంఘలకూ రుణమాఫీ చేస్తా: చంద్రబాబు


రైతు రుణమాఫీ చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ... రైతు రుణమాఫీ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయల పింఛను ఇస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఇబ్బందులున్నాయని... అయినా సమస్యలను అధిగమించి ముందుకు వెళతామని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధానిని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. జంగారెడ్డిగూడెంను అభివృద్ధి ఛేస్తామని అన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి ఇస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు న్యాయం చేస్తామన్నారు. ముస్లింలకు షాదీఖానాలను నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా సంఘాల రుణాలనూ మాఫీ చేసి, బ్యాంకులతో మాట్లాడి కొత్తగా రుణాలను ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News