: ముగిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ
హైదరాబాదులోని సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ ఏడాది మైనార్టీల సంక్షేమానికి రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కొత్త వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. జిల్లా జడ్జి స్థాయి అధికారితో మైనారిటీ రిజర్వేషన్లపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భేటీలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించనున్నారు.