: కేసీఆర్ పై మాజీ మంత్రి డి.కె అరుణ ఫైర్
మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. పోలవరం ముంపు మండలాల విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆమె మండిపడ్డారు. పోలవరంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంటే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి... పోలవరాన్ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె ప్రశ్నించారు. పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ వెళదామని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదని ఆమె అన్నారు. పోలవరం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిన కేసీఆర్... ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.