: వాన కురవకపోతే తాగునీటికి కష్టమే..!
హైదరాబాదు మహానగరంలో వాన కురవకపోతే తాగునీటికి కష్టమే. నగరంలో భూగర్భ నీటిమట్టాలు రోజురోజుకీ పడిపోతున్నాయి. నగరవాసుల దాహార్తి తీర్చేందుకు రోజుకు 490 గ్యాలన్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 340 గ్యాలన్ల నీటిని మాత్రమే జలమండలి సరఫరా చేయగలుగుతోంది. జంటనగరాలకు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూరు-మంజీరా జలాశయాల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గతేడాది 200 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, ఇప్పటివరకు కేవలం 146.6 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా వర్షాలు కురవకపోతే నగరవాసుల తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.