: పార్లమెంటులో సందడి చేసిన ప్రియాంక గాంధీ తనయుడు
ప్రియాంకా గాంధీ తనయుడు రేహాన్ బుధవారం పార్లమెంటులో సందడి చేశాడు. లోక్ సభ సమావేశాలను విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని రేహాన్ ఆసక్తిగా తిలకించాడు. పార్లమెంటులో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యాలయాన్ని కూడా రేహాన్ సందర్శించాడు. రేహాన్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులు కూడా పార్లమెంటును సందర్శించారు. పార్లమెంట్ సమావేశాలను ప్రత్యక్షంగా చూద్దామనే.. తాను ఇక్కడకు వచ్చానని రేహాన్ మీడియాకు తెలిపాడు. సోనియాగాంధీ మనవడు తొలిసారిగా పార్లమెంటుకు రావడంతో కాంగ్రెస్ వర్గాలు హడావుడి చేశాయి.