: పార్టీ కార్యకర్తలకు డీఎస్ బహిరంగ లేఖ
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వేళలా తాను కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని డీఎస్ పిలుపునిచ్చారు. అటు పార్టీ బలోపేతానికి కలసి పనిచేద్దామని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న బాధ కేడర్ లో స్పష్టంగా కనబడుతోందని డీఎస్ పేర్కొన్నారు.