: రుణ మాఫీ చేయకుంటే ఆమరణ దీక్షలే: భారతీయ కిసాన్ సంఘ్
వ్యవసాయ రుణాలను ఈ నెల 25 లోగా మాఫీ చేయకపోతే ఆమరణ దీక్షలకు దిగాల్సి వస్తుందని భారతీయ కిసాన్ సంఘ్, ఏపీ సర్కారుకు హెచ్చరికలు జారీ చేసింది. వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన సంఘ్ నేతలు, ఏదో కారణం పేరిట కాలయాపన చేసేందుకే చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 25 లోగా వ్యవసాయ రుణాలను మాఫీ చేయకపోతే తమ సంఘం ఆమరణ దీక్షలకు దిగుతుందని హెచ్చరించారు.