: ఫిలిప్పీన్స్ ను వణికించిన టైఫూన్... 10 మంది మృతి
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను 'రమ్మసన్' టైఫూన్ వణికించింది. ఈ భీకర టైఫూన్ ధాటికి 10 మంది మరణించినట్టు ప్రభుత్వాధికారులు ప్రకటించారు. లక్షా యాభై వేల మందికి నిలువ నీడ లేకుండా పోయింది. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘రమ్మసన్’ టైఫూన్ బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు తలమునకలై ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పునరావాసం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.