: రాజ్యసభ రేపటికి వాయిదా
ఇవాళ ఉదయం నుంచి రాజ్యసభ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సభలో విపక్ష సభ్యులు గాజాపై దాడులను ఖండిస్తూ తీర్మానం చేయాలని పట్టుబడ్డారు. అందుకు నిబంధనలు అంగీకరించవని డిప్యూటీ చైర్మన్ తెలిపినా, విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. గందరగోళం నెలకొనడంతో... సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.