: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పంట రుణాల మాఫీ, తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతాలకు సంబంధించి ప్రత్యేక అధ్యయన కమిటీని వేయనున్నట్టు సమాచారం.