: కాసేపట్లో టీ-కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఈ భేటీలో 25 అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది. రైతుల రుణమాఫీకి సంబంధించి కూడా ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే ఇంజినీరింగ్ అడ్మిషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది.