: చంద్రుడిపై నీటి తయారీకి నాసా కృషి


చంద్రుడిని నివాసయోగ్యమైన గ్రహంగా మార్చేసి.. అక్కడ ప్లాట్లు వేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేసే వరకు నాసా ఊరుకునేలా కనిపించడం లేదు. ఆ గ్రహం మీద నీటి తయారీకి సంబంధించి ఉండే అవకాశాలను ఇప్పుడు పరిశీలిస్తోంది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచు బిందువులనుంచి నీటిని తయారుచేయగల అవకాశాలపై పరిశోధనలకు పూనుకుంటోంది. ఇందుకు అమెరికా వారి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక రోవర్‌ను తయారుచేస్తోంది. రిజాల్వ్‌ అనే ఈ వ్యోమనౌకను 2017 నవంబర్లో ప్రయోగిస్తారు. మొత్తం 25 కోట్ల డాలర్ల వ్యయంతో చంద్రుడిపై నీటి తయారీ అవకాశాలను తెలుసుకోగోరే ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఫలితం సానుకూలంగా వస్తే.. ఇక అక్కడ నివాసానికి వీలుగా మరో ముందడుగు పడినట్లే!

  • Loading...

More Telugu News