: ఏపీ, తెలంగాణ మధ్య 8 తాత్కాలిక చెక్ పోస్టులు: మంత్రి యనమల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆరు నెలలపాటు వాటిని తాత్కాలికంగా ఉంచుతామని, ప్రత్యేక సిబ్బంది ఉంటారని చెప్పారు. పరిశీలన చేశాక పూర్తిస్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు, సున్నిపెంట, మాచర్ల, దాచేపల్లి, గరికపాడు, తిరువూరు, జీడుగుమిల్లి, కొండపల్లిలో చెక్ పోస్టులు ఉంటాయని వివరించారు. బడ్జెట్ పై వివిధ శాఖల అధికారులతో సమావేశం ముగిసిన అనంతరం యనమల మీడియాతో మాట్లాడారు. విభజనలో రాష్ట్రానికి రావాల్సిన ఎమ్మెల్సీ స్థానాల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. వాస్తవానికి 58 రావాల్సి ఉండగా 50నే వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో జరిగిన లోపాలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే అంశంపై న్యాయశాఖ అధికారులతో సంప్రదించామని మంత్రి అన్నారు. కాగా, ఆగస్టు రెండో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని, 18 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News