: రైతు రుణాల రీషెడ్యూల్ కు ఆర్ బీఐ సూత్రప్రాయ అంగీకారం
ఆంధ్రప్రదేశ్ రైతుల రుణాల రీషెడ్యూల్ కు రిజర్వు బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకు లేఖ రాసింది. ఏపీలో రైతుల రుణాల రీషెడ్యూల్ వివరాలు ఇవ్వాలని కోరింది. మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని ఆర్ బీఐ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.