: బ్రిటన్ మంత్రిగా మోడీ మద్దతుదారు


బ్రిటన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఓ భారత సంతతి మహిళ స్థానం దక్కించుకోవడం విశేషం. కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికైన ప్రీతి పటేల్ (42) ను ట్రెజరీ శాఖ మంత్రిగా ప్రధాని డేవిడ్ కామెరాన్ నియమించారు. కాగా, ప్రీతి భారత ప్రధాని నరేంద్ర మోడీని అమితంగా అభిమానిస్తారు. ఇటీవలే భారత్ లో పర్యటించిన బ్రిటన్ ఉన్నతస్థాయి బృందంలో ప్రీతి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మోడీని కలిశారు. ఇటీవలే ఓ పత్రికకు రాసిన వ్యాసంలో మోడీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. దేశాన్ని సంస్కరణల బాటలో నడపాలని ఆశిస్తున్న మోడీకి అంతా మంచే జరగాలని ఆమె ఆకాంక్షించారు. మోడీని బ్రిటన్ కు మిత్రుడిగా చెప్పుకునేందుకు తాము గర్విస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News