: విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు మార్గదర్శకాలు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతైన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో, విద్యార్థుల విజ్ఞాన యాత్రలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యూజీసీ, ఏఐసీటీఈలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ మార్గదర్శకాలు ఉండాలని సూచించింది. ఈ వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు లోక్ సభకు తెలిపారు.