: చెన్నై క్లబ్బులో పంచెల నిషేధంపై సీఎం జయలలిత ఆగ్రహం
చెన్నై క్లబ్బులో పంచెల నిషేధంపై ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి.హరిపరంథామన్, ఇద్దరు న్యాయవాదులు కొన్ని రోజుల కిందట తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ క్లబ్బు (టీఎన్ఎసీఏ)కి పంచెలు ధరించి వెళ్లారు. వారిలో పంచెతో వెళ్లిన పరంథామన్ ను క్లబ్బు సిబ్బంది అడ్డుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగడంతో ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో జయలలిత ఓ ప్రకటన చేశారు. తమిళనాడు సంప్రదాయాలను విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు తమిళ సంస్కృతి, సంప్రదాయానికి వ్యతిరేకమన్నారు. క్లబ్బుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా సంకోచించమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సదరు క్లబ్బువారు వివరణ ఇవ్వాలని జయ ఆదేశించారు.