: భాజాపా అధ్యక్షుడిగా కార్యరంగంలోకి దిగిన అమిత్ షా


బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే అమిత్ షా కార్యరంగంలోకి దిగారు. వచ్చే సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్టాల పై ఆయన ఫోకస్ పెట్టారు. ఈ రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా రాష్ట్రాల ముఖ్య నాయకులతో చర్చోపచర్చలు మొదలుపెట్టారు. ఈ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశంలో మెజార్టీ రాష్ట్రాలను పాలిస్తున్న క్రెడిట్ తో పాటు రాజ్యసభలో కూడా భాజాపా బలపడుతుంది. రాజ్యసభలో ఇప్పటికీ కాంగ్రెస్ దే మెజార్టీ. ఈ రాష్ట్రాల్లో గెలవడం ద్వారా రాజ్యసభపై కూడా పట్టు సాధించాలని భాజాపా భావిస్తోంది.

  • Loading...

More Telugu News