: విద్యార్థిని గదిలో పెట్టి తాళమేసుకెళ్లిన ఉపాధ్యాయులు


ఎప్పుడెప్పుడు నాలుగు గంటలవుతుందా... అని ఎదురు చూసే ఉపాధ్యాయులు ఇంటికెళ్లే హడావిడిలో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు పిల్లలపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. ఈ తరహా ఘటనే ఒకటి కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొంది పాఠశాలలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న నరసింహస్వామి అనే చిన్నారి పాఠశాల విడిచినా, మిగిలిన పిల్లల మాదిరిగా వేగంగా బయటకు వెళ్లలేదు. అయితే ఇంటికెళ్లే హడావిడిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలందరూ బయటకు వెళ్లారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించకుండానే నరసింహస్వామిని లోపలే పెట్టేసి గదికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే ఆరు గంటలవుతున్నా, స్వామి ఇంటికి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు గ్రామమంతా వెతికి పాఠశాల వద్దకు వచ్చారు. గదిలో నేలపైనే పడుకుండిపోయిన స్వామిని వారు గుర్తించారు. వెనువెంటనే తాళం బద్దలు కొట్టి బాలుడిని బయటకు తీసుకొచ్చారు. మరింత ఆలస్యమై ఉంటే పరిస్థితి ఏమిటని గ్రామస్తులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News