: ధ్యానంతో పెరిగే రోగనిరోధక శక్తి


కొన్ని నిర్దిష్ట పద్ధతులను ఉపయోగించడం ద్వారా.. మెదడు ద్వారా నియంత్రిస్తూ పోయినట్లయితే మనలో రోగనిరోధకశక్తి పెరుగుతుందిట. శరీరంలో ఉండే రోగకారక క్రిములతో పోరాడడం అనేది సులువు అవుతుందిట. ఇలాంటి ప్రక్రియకు ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని.. పరిశోధనల్లో తేలుతోంది. భారతీయ సనాతన ధర్మం ప్రవచించే ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ దేశాలన్నీ ఈ వాస్తవాన్ని నమ్ముతున్నాయి. ఆచరిస్తున్నాయి కూడా. అయితే తాజాగా ధ్యానం వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం కూడా సాధ్యమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. టిబెట్‌లో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ విషయం నిర్ణయించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ పరిశోధకులు తెలిపారు. ధ్యాన పద్ధతుల్లో శరీర ఉష్ణోగ్రతను 38.3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెంచవచ్చునట. సాధారణంగా ఇది.. 37 డిగ్రీల సెల్సియస్‌ మాత్రమే ఉంటుంది.

  • Loading...

More Telugu News