: రాహుల్ కు ఆర్ఎస్ఎస్ గురించి ఓనమాలు కూడా తెలియవు: బీజేపీ నేత
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ధ్వజమెత్తారు. రాహుల్ కు ఆర్ఎస్ఎస్ గురించి ఓనమాలు కూడా తెలియవని వ్యాఖ్యానించారు. ఆయన తన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సలహా ఇచ్చారు. ఇటీవలే పాక్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ ను కలిసిన జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ ఓ ఆర్ఎస్ఎస్ మనిషి అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై సుశీల్ కుమార్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. "రాహుల్ తొలుత గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ వాదులే అన్నారు. ఇప్పుడు వైదిక్ ను ఆర్ఎస్ఎస్ మనిషిగా అభివర్ణిస్తున్నారు. ఆయన జీకే పెంచుకోవాలి" అని పేర్కొన్నారు.