: ఇళ్లను వదిలి వెళ్లండి: గాజా వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరిక


హమాస్ స్థావరాలకు నిలయమైన గాజా ను విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా గాజా వాసులను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఇజ్రాయెల్ సైన్యం వివిధ రకాల ప్రసార సాధనాల ద్వారా గాజా వాసులకు విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా హమాస్ స్థావరాలున్నట్లుగా ఇజ్రాయెల్ అనుమానిస్తున్న ప్రాంతంలో లక్ష మంది మేర పౌరులు నివాసముంటున్నారు. దీంతో వీరిని అక్కడి నుంచి తరలించేందుకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈజిప్టు ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించని నేపథ్యంలో ఇజ్రాయెల్ బుధవారం ఉదయం తిరిగి దాడులను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే గాజా పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News