: అమెరికా అధ్యక్ష్య పదవి రేసులో బాబీ జిందాల్?


ఇప్పటికే అమెరికా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న భారత సంతతి అమెరికన్ బాబీ జిందాల్, 2016లో ఆ దేశ అధ్యక్ష్య పదవి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయంటూ టైమ్ మేగజీన్ చెబుతోంది. ఆ పత్రిక తాజా సంచికలో బాబీ ఇంటర్వ్యూను ప్రముఖంగా ప్రచురించింది. బరాక్ ఒబామా సర్కారు చేపడుతున్న పలు అంశాలపై విశ్లేషణలు చేస్తున్న జిందాల్, ఒబామా హెల్త్ కేర్ పై ఎనిమిది మిలియన్ల మంది వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాక ఇప్పటికే ఎంతో చేశామని చెప్పుకుంటున్న తమ పార్టీ, చేయాల్సిన పనులపై అంతగా దృష్టి సారించడం లేదని కూడా జిందాల్ సదరు ఇంటర్వ్యూలో బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్ తర్వాత గాని ఎన్నికల విషయంపై నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీలో చోటుచేసుకున్న సైద్ధాంతిక విబేధాల నేపథ్యంలో విభజన జరిగిన పక్షంలో బాబీ జిందాల్ ఆ పార్టీకి భవిష్యత్తు ఆశాకిరణమే కాగలడని టైమ్ మేగజీన్ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News