: ఈ 'సోషల్ సైట్' మీ ఆలోచనలకు ఖరీదు కడుతుంది!


ఇంటర్నెట్లోకి మరో సోషల్ నెట్వర్కింగ్ సైట్ రంగప్రవేశం చేసింది. దీని పేరు 'బబ్లూస్'. ఈ సైట్లో లాగిన్ అయి మీ వినూత్నమైన ఆలోచనలను పోస్ట్ చేసినా, మరెవరివైనా షేర్ చేసుకున్నా మీకు కొంత మొత్తం ముట్టజెపుతారు. తమ సైట్లో పోస్ట్ చేసే కంటెంట్ ను వాణిజ్య ప్రకటనలతో అనుసంధానం చేస్తామని సైట్ వ్యవస్థాపకులు అరవింద్ దీక్షిత్, జాసన్ జుకారీ తెలిపారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఖాతాదారుల బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా, యాడ్లను చొప్పించి సొమ్ము చేసుకుంటాయని వారు తెలిపారు. కానీ, తమ బబ్లూస్.కామ్ ఖాతాదారుల పోస్టింగ్స్ ద్వారా మాత్రమే సమాచారం సేకరిస్తుందని, వారిపై నిఘా వేయబోదని వివరించారు. వినియోగదారులు చేసే పోస్టింగ్స్, షేరింగ్స్ కు నిర్దేశిత మొత్తంలో నగదు చెల్లిస్తామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News