: పోలవరం బిల్లు పాస్ చేయించిన ఎన్డీఏకు కృతజ్ఞతలు: ఆనం వివేకా
పార్లమెంటు ఉభయసభల్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పొందడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోలవరం బిల్లు రూపొందించిన యూపీఏకు, బిల్లును పాస్ చేయించిన ఎన్డీఏకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు.